సూర్యనగర్ కొట్టాలకు రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాల కల్పనకు పరిశీలన.. 25 కుటుంబాల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్..
(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని హమాలీ కాలనీ సమీపంలో, ఆర్యన్ స్కూల్ దగ్గర ఉన్న సూర్యనగర్ కొట్టాల్లో నివసిస్తున్న 25 కుటుంబాలు రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను గుర్తించిన స్థానికులు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సహకారంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సిబ్బంది గురువారం సూర్యనగర్ కొట్టాలను సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయడానికి అవసరమైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు పరిశీలన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది తేజ, మాధవి, ఇంజనీరింగ్ సిబ్బంది విజయ్, స్థానిక టీడీపీ నాయకులు బోయ ఆది, రసూల్, ఆదిశేషయ్య, సుమలత, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.