భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవ్‌పేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే పనుల పురోగతిని, సర్వే చేపడుతున్న విధానాన్ని, భూ రికార్డులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, హౌసింగ్ అధికారి భాస్కర్, ల్యాండ్ సర్వే ఏడీ, ఎంపీఓ, మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు సర్వే సిబ్బంది పాల్గొన్నారు.