పూలకుర్తి గేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రెండు కార్లు ఢీ. ఇద్దరు మృతి
రాయదుర్గం మేజర్ న్యూస్ : రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన హీరేహాళ్ మండల పరిధిలో చోటుచేసుకుంది.... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....
హీరేహాళ్ మండలంలోని పూలకుర్తి గేట్ సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద రాయదుర్గం - హీరేహాళ్ - రాయదుర్గం పోవు రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి..... ఈ ప్రమాదంలో హీరేహాళ్ మండల పరిధిలోనే ఎస్సార్ కోట (: సంజీవరాయుని కోట ) చెందిన మల్లికార్జున రెడ్డి, అతని డ్రైవర్ ఎస్ చాంద్ బాషా ఘటనలో దుర్మరణం చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.... ఈ ప్రమాదంలో 8 మంది తో పాటు, ఆంధ్రప్రభ విలేఖరి సిద్దేశ్ నాయక్..తీవ్ర గాయాలు అయ్యాయి... క్షతగాత్రులను 108 వాహనంలో బళ్లారి విమ్స్ కు తరలించినట్లు స్థానికులు తెలిపారు... ఈ ఘటనపై ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రిపోర్టర్ : శివప్రసాద్ రాయదుర్గం ఇంచార్జ్ మేజర్ న్యూస్.