BREAKING
‘రామాయణ’ కోసం చిన్న సినిమా షోల కోత: కేంద్ర మంత్రికి సినీ కార్మిక సంఘం సంచలన లేఖ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ రాప్తాడు బాలికకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాతృత్వపు అనుభవాలను పంచుకున్న కియారా అద్వానీ: అలియా భట్, కత్రినా కైఫ్ అండగా నిలిచారంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు లయన్ డాక్టర్ రేకులపల్లి విజయ కు మాతృసవనం సన్మానం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డు, సన్మానం బాలీవుడ్ పరిశ్రమ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి: సిద్ధార్థ్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు 7 రోజుల్లోనే రూ.1,000 కోట్ల క్లబ్ దిశగా 'రామాయణ' ‘సీరియల్ కిస్సర్’ ట్యాగ్‌పై ఇమ్రాన్ హష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ డైరెక్టర్ వల్లే ఇదంతా జరిగింది NHM ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ రక్షణ సేన సంఘీభావం 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి* క్రీడల్లో గెలుపు ఓటములు సహజం ఎస్సై చంద్రకుమార్ అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారు: ఏడాది నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సరికొత్త చిత్రం అనిరుధ్ వివాహ వేడుకలో రజనీకాంత్ సందడి: ‘మనసిలాయో’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్, వీడియో వైరల్

వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి.

Select Suryaa Now
వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి.

కళ్యాణదుర్గం: వందేళ్లుగా ఎదురుచూస్తున్న కృష్ణా జలాల కలను సాకారం చేస్తూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన పట్టుదలతో చాపిరి చెరువుకు కృష్ణా జలాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన ప్రత్యేక కృషి ఫలించడంతో చాపిరి చెరువులో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే చెరువుకు నీటిని చేర్చడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక చొరవతో పాటు తన సంస్థ ఎస్సార్సీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగించి పంట పొలాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో స్వంత నిధులను వెచ్చించి నీటిని చెరువుకు తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సాధారణంగా ఇలాంటి పనులకు ఎక్కువ సమయం పడుతుందని భావించే పరిస్థితుల్లో కేవలం పది రోజుల్లోనే పనులు పూర్తి చేసి చెరువుకు కృష్ణా జలాలను చేర్చడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణ ద్వారా ఫలితాలు చూపించారంటూ ఎమ్మెల్యే కృషిని పలువురు కొనియాడారు. చాపిరి గ్రామ ప్రజలు, రైతులు ఎన్నో ఏళ్లుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో చెరువుకు నీరు చేరడం వారి ఆశలకు కొత్త ఊపిరి పోసింది. ఈ సందర్భంగా గురువారం గ్రామంలో సందడి నెలకొంది. మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపుగా చాపిరి చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువులోకి చేరి మరువ పారుతున్న కృష్ణా జలాలకు సంప్రదాయబద్ధంగా జలహారతి ఇచ్చారు. మహిళలు నీటిలోకి దిగి కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జలహారతి కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ ప్రాంతానికి సాగునీరు అందాలన్న కల ఇప్పుడు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. చెరువులో నీరు చేరడంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు కలుగుతుందని, పంటల సాగుకు మరింత భరోసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రాంత రైతుల కష్టాలను గుర్తించి కృష్ణా జలాలను తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు గ్రామస్థులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాపిరి చెరువులో కృష్ణా జలాలు చేరడం కేవలం నీటి రాక మాత్రమే కాకుండా ఈ ప్రాంత రైతుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తోందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ సాగునీటి వనరుల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.