ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం
శంషాబాద్ : ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో జాతీయ రహదారి-44పై ఈ ఘటన చోటుచేసుకుంది.
కాకా మూవీ షూటింగ్ ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా, వెనుక నుంచి కూరగాయల లోడుతో వేగంగా వచ్చిన మినీ ట్రక్కు ఆయన ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే అదృష్టవశాత్తు శేఖర్ మాస్టర్ స్వల్ప గాయాలతో బయటపడగా, కారులో ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.
పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ శంషాబాద్.