టీడీపీ చేసిన అభివృద్ధి ప్రజల మనస్సును దోచించి
గోనెగండ్ల,సూర్య ప్రతినిధి
I
గ్రామాలలో టీడీపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల మనస్సులను దోచించిందని దాంతోనే గ్రామాలలో కూటమీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థు లను విజయం వరించిందని రాష్ట్ర కుర వ కార్పోరేషన్ డైరెక్టర్ రామకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూటమీ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారని కూటమీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే ఇందుక సాక్ష్యమని రామకృష్ణ అన్నారు. ఈ ఎన్నికలలో సీఎం చంద్రబాబునాయుడు రాజకీయంగా బీసీ లను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లారని తెలిపారు. టీడీపీ అంటేనే బీసీ పార్టీ అని ఎప్పటి నుంచో ప్రచారం లో ఉందని ఆయన గుర్తు చేశారు. రాజకీయలలో బీసీలకు వెన్ను దన్నగా నిలిచిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది కేవలం టీడీపీ మాత్రమే నన్నారు. బీసీలకు రాజకీయంగా మంచి స్థానాన్ని కల్పించేందుకు గాను టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలి పారు. వచ్చే సర్పంచ్ ఎన్నికలలో కూడా టీడీపీ సానుభూతి పరుల గెలుపును ఎవ్వరు ఆపలేరని అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ టీడీపీ చుక్కలు చూపించడం ఖాయమ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాజులదిన్నె ప్రాజెక్టు మత్స్య సంఘం అధ్యక్షుడు రంగస్వామినాయుడు, టీడీపీ నాయకుడు రాముడు, శ్రీనివాసులు, ఆచారి, నాగేష్ సీమోన్, హనుమంతు, లోకేష్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.