BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

రాష్ట్రంలో ఫస్ట్ స్వచ్ఛ సిటీ గా అవార్డురావడం గర్వకారణం

Select Suryaa Now
రాష్ట్రంలో ఫస్ట్ స్వచ్ఛ సిటీ గా అవార్డురావడం గర్వకారణం

నేటి దినపత్రిక సూర్య బ్యూరోరాజమహేంద్రవరం :నగరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రంలోనే ఫస్ట్ స్వచ్ఛ సిటీ అవార్డును దక్కించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రంలోనే ఫస్ట్ స్వచ్ఛ సిటీ అవార్డును సాధించిన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. ఈ అరుదైన ఘనత సాధించడంలో నగర ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు, అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఖాళీల భర్తీపై కనీసం దృష్టి సారించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు చెందిన వారు, రిటైర్డ్ అయిన ఉద్యోగుల కారణంగా ఏర్పడిన 79 ఖాళీలను ఆప్కోస్ ద్వారా అధికారికంగా భర్తీ చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిక్షా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ.9 వేల నుంచి రూ.15 వేలకు పెంచి వారి కుటుంబాల్లో ఆనందం నింపామని పేర్కొన్నారు. రిక్షా కార్మికులతో పాటు డ్రైవర్లు, ఇతర పారిశుద్ధ్య సిబ్బందికి కూడా వేతనాలు పెంచి పూర్తి భరోసా కల్పించామని వివరించారు. నగరంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను, చిన్నచిన్న లోపాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ నగర అభివృద్ధిలోభాగస్వాములవుతున్న అందరి సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇదే స్ఫూర్తితో పరిశుభ్రతలో అగ్రగామిగా నిలిచిన రాజమహేంద్రవరాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.