BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

పెట్టుబడులు ఉద్యోగాలు పేరుతో మభ్యపెడుతున్న కూటమీ ప్రభుత్వం

Select Suryaa Now
పెట్టుబడులు ఉద్యోగాలు పేరుతో మభ్యపెడుతున్న కూటమీ ప్రభుత్వం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే యూనివర్సిటీ అభివృద్ధిని మాత్రం విస్మరిస్తోందని విమర్శించారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కనీసం రూ.1,000 కోట్లు కేటాయించాలని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గతంలో యూనివర్సిటీ భూములను రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకుని, యూనివర్సిటీపై భారీ ఆర్థిక భారం మోపారని పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలకు విలువైన భూములు కేటాయిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారని, ఇప్పటికే ఐదు పెట్టుబడుల సదస్సులు నిర్వహించి 550 పెట్టుబడులు, రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఈ ఏడాది మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు ఎన్ని? వాటికి ఎంత భూమి కేటాయించారు? వాస్తవంగా ఎంత పెట్టుబడి పెట్టాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాయి? అనే వివరాలను ప్రజల ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు, ఉద్యోగాల ప్రకటనలు పత్రికల్లోనే కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన కనిపించడం లేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి, రైతులకు ఏటా రూ.20 వేల రైతు భరోసా, 19 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, 20 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ప్రజలకు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ఉచిత బస్సు పథకంలోనూ అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ, ఎన్నికల హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహించిన సమయంలో ఎస్సీ, ఎస్టీలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్ధరిస్తామని, గత ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై జరిగిన దాడులు, మరణాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్, కిరణ్ కుమార్, సయ్యద్ పాషా తదితరుల ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు పోలీసు కస్టడీ మరణాలు, దళితులపై వివక్ష ఘటనలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.పెట్టుబడులు, ఉద్యోగాలు, సూపర్ సిక్స్ హామీలు, విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హర్షకుమార్ కోరారు. ప్రచార ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టకుండా వాస్తవ అభివృద్ధి చూపించాలని, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.