BREAKING
ఆంధ్రప్రదేశ్ ప్లాంట్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు 12 వేల ఉద్యోగాల కల్పన అభివృద్ధి పనుల పరిశీలన 2026 విక్రయాల అంచనా పెంపు, అయితే కోలుకోవడం కష్టమేనని హెచ్చరిక కీలకమైన పండుగ సీజన్ అమ్మకాలపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న బూట్‌మేకర్ సెంట్రిస్ట్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్న ఈసీబీ చీఫ్ క్రిస్టియన్ లగార్డ్ పెరిగిన రక్షణ డిమాండ్‌తో ఫ్రీ క్యాష్ ఫ్లో అంచనాలను సవరించిన దిగ్గజ సంస్థ గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల జలాశయాల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి* టీడీపీ చేసిన అభివృద్ధి ప్రజల మనస్సును దోచించి ఈనెల 14న నర్సాయపల్లిలో దివంగత పాండుగౌడ్ సంస్మరణ సభ భూ రీసర్వే పనుల పరిశీలన మాస్కోకు చేరుకున్న అమెరికా రాయబారులు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ చిత్రగుప్త యాప్ ద్వారా మున్సిపల్ సేవలపై సమీక్ష.. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కౌలు రైతులకు బీమా పరిహారం అందించారు రాష్ట్రంలో ఫస్ట్ స్వచ్ఛ సిటీ గా అవార్డురావడం గర్వకారణం

రేపు కళ్యాణదుర్గం లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ..

Select Suryaa Now
రేపు కళ్యాణదుర్గం లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ..

**కళ్యాణదుర్గం,+-** ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నవంబర్ 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేయడంతో పాటు, పార్టీ శ్రేణుల ఐక్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విజయోత్సవ ర్యాలీలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంగా కూడా ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజావేదిక వద్ద పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సమావేశమై ర్యాలీలో పాల్గొననున్నారు. పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా ర్యాలీ నిర్వహించే అంశంపై పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు అందించిన మద్దతు, కార్యకర్తల కృషి, నాయకుల సమష్టి ప్రయత్నాల ఫలితంగా సాధించిన విజయాన్ని ప్రజల మధ్య పంచుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయోత్సవ ర్యాలీకి కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని వార్తా మాధ్యమాల్లో కవర్ చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. నూతన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరగనున్న ఈ విజయోత్సవ ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.