23 మంది లబ్ధిదారులకు రూ.10.83 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవాబుపేట్, మేజర్ న్యూస్: నవాబుపేట్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.10,83,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అనారోగ్య సమస్యలు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.