చిల్లేపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్మన్‌గా కట్టా రామారావు బాధ్యతల స్వీకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 12 మందితో పాలకవర్గం ఏర్పాటు
చిల్లేపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
చైర్మన్‌గా కట్టా రామారావు బాధ్యతల స్వీకరణ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 12 మందితో పాలకవర్గం ఏర్పాటు
నేరేడుచర్ల, మేజర్ న్యూస్
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది. చైర్మన్‌గా నియమితులైన కట్టా రామారావుతో పాటు మరో 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
13 మందితో నూతన పాలకవర్గం
నూతన పాలకవర్గంలో చైర్మన్ కట్టా రామారావుతో పాటు సభ్యులుగా కేశిరెడ్డి నర్సిరెడ్డి, వనం రామకోటయ్య, అనంతు రేణుక, గజగంటి ప్రవీణ్, కారింగుల సుజాత, దోరేపల్లి లింగమ్మ, గంటా రాఘవరెడ్డి, దిండిగాల కిరణ్, మాలోతు సైదా, నన్నెపంగు ఏడుకొండలు, బండ్ల నాగేశ్వరరావు, పల్లె లింగయ్య బాధ్యతలు స్వీకరించారు.
మంత్రి ఉత్తమ్ సహకారంతో పాలకవర్గం ఏర్పాటు
చిల్లేపల్లి పీఏసీఎస్ కార్యాలయంలో సహకార సంఘం సీఈఓ బుడిగే నాగరాజు నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి,వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టా రామారావు గతంలో రెండుసార్లు సర్పంచ్‌గా పనిచేశారని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నూతన పాలకవర్గం ఏర్పాటైందని పేర్కొంటూ చైర్మన్‌తో పాటు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ కమల,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చాలాసాని శ్రీనివాస్ రావు, చిల్లేపల్లి సర్పంచ్ అపర్ణ మనోజ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్లు తాళ్ల సురేష్ రెడ్డి, పెరబోయిన వీరయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు లచ్చయ్య, కొంజెటి జ్యోతిబాబు, పాలకవీడు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.