పెద్దపంజాణిలో నామినేషన్ల కేంద్రాలు ఇవే
పెద్దపంజాణి మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల నామినేషన్ల స్వీకరణకు అధికారులు 6 కేంద్రాలను ఖరారు చేశారు. మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీ లను 6 క్లస్టర్లుగా విభజించి, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కేంద్రాల వారీగా పంచాయతీల వివరాలు ఇలా ఉన్నాయి.శంకరరాయపేట, శివాడి, నిడిగుంట, ముదరంపల్లి పంచాయతీలకు శంకర్రాయల్ పేట స్వర్ణ పంచాయితీ భవనం,అప్పినపల్లె, చామనేరు, అమ్మరాజుపల్లె, బొమ్మరాజుపల్లె పంచాయతీలకు చామనేరు స్వర్ణ గ్రామ పంచాయతీ భవనం,కరసనపల్లె, రాజుపల్లె, మద్దనపల్లె, పెద్దవెలగటూరు పంచాయతీలకు పెద్దవెలగటూరు స్వర్ణ గ్రామ పంచాయతీ భవనం, పెద్దకాపల్లె, నాగిరెడ్డిపల్లి, వీరప్పల్లె, కోగిలేరు, రాయలపేట పంచాయతీలకు రాయలపేట గ్రామ పంచాయతీ భవనం, పెద్దపంజాణి, చలమంగళం, కొలత్తూరు, తుర్లపల్లె పంచాయతీలకు కొలత్తూరు స్వర్ణ గ్రామం భవనం,లింగాపురం, పెద్దరికుంట, ముత్తుకూరు, బట్టందొడ్డి పంచాయతీలకు బట్టందొడ్డి గ్రామ పంచాయతీ భవనాలలో సంబంధిత పంచాయతీల నుంచి పోటీ చేయాలను కునే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి