BREAKING
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ వారణాసి తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపైనే ఫోకస్? సీఐఐ సదస్సు ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను వీక్షించిన మంత్రి లోకేష్

బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీ సుధ హైస్కూల్

Select Suryaa Now
బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీ సుధ హైస్కూల్

డోన్,  మేజర్ న్యూస్:భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, డోన్‌లోని శ్రీ సుధ హైస్కూల్‌లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు, ఆటల పోటీలు ఏర్పాటు చేయగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పిల్లలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, క్రమశిక్షణ, మంచి నడవడిక, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. శనివారం (నవంబర్ 14) నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని కష్టపడి చదివి దేశానికి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుదర్శన్, డైరెక్టర్లు రాజా సుధాకర్ గుప్తా, కరణం సూర్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు మేరీ చార్లెస్, వైస్ ప్రిన్సిపల్ షమీనా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.