BREAKING
మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు మురసు తుపాను తీవ్రమైన నష్టాన్ని మిగిల్చిందని అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థిని ఎంపిక నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు సంసిద్ క్యాంఫర్డ్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో బాలల దినోత్సవ సంబురాలు – ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో చిన్నారుల సందడి.” ఆర్ట్ ఫెస్టివల్‌లో ప్రతిభ చాటిన చెంచు విద్యార్థులు విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి లింగాల హై స్కూల్ ఇంచార్జ్ హెచ్ఎం కొండయ్య బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్‌ను కలిసిన జగ్గయ్యపేట బీసీవై పార్టీ నాయకులు మార్టూరులో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న పల్సర్ బైక్.. ఇద్దరు యువకులు మృతి కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి అండగా ఉంటాం : కేఎల్ఆర్ సంగోజివాడి, వంకాయపల్లి శివార్లలో భూముల రీ-సర్వేపై అవగాహన సదస్సు వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి. మురళీకృష్ణ రవిప్రకాష్‌కు కీర్తి పురస్కారం స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన కేఎల్ఆర్ మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఉద్యాన పంటలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం గ్రామసభలో విద్యార్థుల గళం

కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం

Select Suryaa Now
కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం

సూర్య న్యూస్ అద్దంకి. 

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అద్దంకి నర్రావారిపాలెం 'గొట్టిపాటి యూత్' సభ్యులు అభినందనీయమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. నర్రావారిపాలెం నుండి గుండ్లకమ్మ నదికి వెళ్లే రహదారిని గత నాలుగు రోజులుగా జేసీబీ (JCB) మరియు ట్రాక్టర్ల సహాయంతో రాళ్లు, చెత్తాచెదారం తొలగించి పూర్తిగా చదును చేయించారు. అలాగే, తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో నదికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి పొడవునా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మాల ధరించిన అయ్యప్ప స్వాములు, భవాని స్వాములు, శివ స్వాములతో పాటు కార్తీక దీపాలు వెలిగించేందుకు నదికి వచ్చే భక్తులందరూ ఈ బాగుచేసిన రహదారిని, లైటింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొట్టిపాటి యూత్ సభ్యులు కోరారు. యువత చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై స్థానిక భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.