BREAKING
ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ వారణాసి తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపైనే ఫోకస్?

విజయోత్సవ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు.

Select Suryaa Now
విజయోత్సవ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు.

కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి సాధించిన ఘన విజయంతో కళ్యాణదుర్గం పట్టణంలో విజయోత్సాహం వెల్లివిరిసింది. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలుపుతూ, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపే లక్ష్యంతో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి వేలాదిగా తెలుగు తమ్ముళ్లు తరలివచ్చారు. పసుపు జెండాలు, పార్టీ కండువాలు, భారీ జనసందోహంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పసుపుమయంగా మారాయి. జై చంద్రన్న.. జై సురేంద్ర అన్న అంటూ కార్యకర్తలు, అభిమానులు చేసిన నినాదాలతో కళ్యాణదుర్గం పట్టణం మార్మోగింది. ర్యాలీ ప్రారంభం నుంచి ముగింపు వరకు కార్యకర్తల ఉత్సాహం ఉరకలెత్తింది. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గెలుపొందిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు సాధించిన విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణిస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ నాయకులకు స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, బాణసంచా, నృత్యాలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీపై విశ్వాసం ఉంచి ఘన విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామనే భావనతో కాకుండా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ అన్ని గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు ప్రశంసించారు. బీటీపీ పనులను వేగవంతంగా కొనసాగిస్తూ రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. చాపిరి చెరువుకు కృష్ణా జలాలను తీసుకురావడం నియోజకవర్గ రైతాంగానికి ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి సుమారు 7,300 సైకిళ్లను పంపిణీ చేయడం, పాఠశాలలు, ఆలయాలకు సహకారం అందించడం, బోర్లు వేయించడం వంటి పలు సేవా కార్యక్రమాలను నాయకులు గుర్తుచేశారు. ఎన్నికల్లో సాధించిన విజయంతో పార్టీ శ్రేణులపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2029 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల పాల్గొనడంతో విజయోత్సవ ర్యాలీ రాజకీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు జెండాల రెపరెపలు, నినాదాలు, నాయకుల ప్రసంగాలతో కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ విజయోత్సాహానికి వేదికగా మారింది.
కళ్యాణదుర్గం ఇంచార్జ్ సుధామోహన్.