సిపిఎం నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం నగర నూతన మేయర్‌గా ఇటీవల ఎన్నికైన సి. రమేష్ గౌడ్ శుక్రవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసులు గారిని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ గారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న సి. రమేష్ గౌడ్‌కు సిపిఎం నాయకులు వి. శ్రీనివాసులు, రాంభూపాల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగరంలో నెలకొన్న పలు ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారు కాసేపు చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా మేయర్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్