పశుసంవర్ధక శాఖ సిబ్బందితో JD సమీక్ష.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. జెడి ఎన్. నాగమణి ఈ సమావేశానికి హాజరై పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. భారత్ పసుధన్ డేటా ప్యూరిఫికేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న టెక్నికల్ ఇష్యూస్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం జిల్లాలో చేపట్టిన గొర్రెలు, మేకలు అలాగే పాడి పశువులైన ఆవులు, బర్రెలకు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ సేకరించి, అర్హత కలిగిన ప్రతి రైతుకూ పశుబీమా సౌకర్యం అందేలా సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. తుఫాన్లు, వర్షాల ప్రభావం వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతినకుండా వాటిని రక్షించేందుకు రొటీన్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో పాటు హెచ్.ఎస్, ఈ.టి వ్యాక్సినేషన్లను ముమ్మరంగా నిర్వహించాలని సిబ్బందిని అప్రమత్తం చేశారు. పశుపోషకులు, రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.