వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బాల్మూరి వెంకట్‌కు వినతి
సూర్య వీణవంక : మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ సమాజ కార్యకర్త పత్తి వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ కళాశాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు మండల విద్యా, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని వివరించి, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.దీనిపై సానుకూలంగా స్పందించిన బాల్మూరి వెంకట్ గారు త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వీణవంకలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తానని హామీ ఇచ్చారు.