BREAKING
గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ కళ్యాణదుర్గంలో వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. 107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం వరద ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో కొలువైన వరద ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజ నిర్వహించారు.ఆలయ అర్చకులు జేరుబండి నాగరాజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ మహా మంగళహారతి పూజలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ

వికారాబాద్‌లో నూతన కోర్టుల భవన సముదాయానికి శంకుస్థాపన

Select Suryaa Now
వికారాబాద్‌లో నూతన కోర్టుల భవన సముదాయానికి శంకుస్థాపన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా వికారాబాద్‌లో నూతనంగా నిర్మించనున్న 10+2 కోర్టుల భవన సముదాయానికి శనివారం భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, వికారాబాద్ జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ రేణుక యార ముఖ్య అతిథిగా హాజరై, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండలతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులకు మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అటవీ వసతి గృహం వద్ద న్యాయమూర్తులు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో న్యాయమూర్తులు మాట్లాడుతూ… జిల్లాలో నూతన కోర్టుల ఏర్పాటు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో కీలక ముందడుగని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందని, వాటి తగ్గింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి మీడియేషన్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోర్టుల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అవసరమన్నారు.జిల్లాలో పోక్సో న్యాయస్థానం ఏర్పాటు కావడంతో బాలలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. కుటుంబ న్యాయస్థానం అందుబాటులోకి రావడంతో కుటుంబ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మెరుగైన న్యాయసేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ న్యాయమూర్తి లాల్‌సింగ్ శ్రీనివాస నాయక్, హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు అనంతసేనా రెడ్డి, ఆకుల మహేష్ కుమార్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. లవకుమార్, కార్యదర్శి పి. వెంకట్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సీనియర్ న్యాయవాది యాదవరెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, వివిధ కోర్టుల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.