BREAKING
ఆంధ్రప్రదేశ్ ప్లాంట్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు 12 వేల ఉద్యోగాల కల్పన అభివృద్ధి పనుల పరిశీలన 2026 విక్రయాల అంచనా పెంపు, అయితే కోలుకోవడం కష్టమేనని హెచ్చరిక కీలకమైన పండుగ సీజన్ అమ్మకాలపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న బూట్‌మేకర్ సెంట్రిస్ట్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్న ఈసీబీ చీఫ్ క్రిస్టియన్ లగార్డ్ పెరిగిన రక్షణ డిమాండ్‌తో ఫ్రీ క్యాష్ ఫ్లో అంచనాలను సవరించిన దిగ్గజ సంస్థ గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల జలాశయాల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి* టీడీపీ చేసిన అభివృద్ధి ప్రజల మనస్సును దోచించి ఈనెల 14న నర్సాయపల్లిలో దివంగత పాండుగౌడ్ సంస్మరణ సభ భూ రీసర్వే పనుల పరిశీలన మాస్కోకు చేరుకున్న అమెరికా రాయబారులు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ చిత్రగుప్త యాప్ ద్వారా మున్సిపల్ సేవలపై సమీక్ష.. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కౌలు రైతులకు బీమా పరిహారం అందించారు రాష్ట్రంలో ఫస్ట్ స్వచ్ఛ సిటీ గా అవార్డురావడం గర్వకారణం

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు: ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర

Select Suryaa Now
ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు:    ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర

ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు,

 ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర

హైదరాబాద్‌, మేజర్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖ లో విలీనం చేసి 10+2 విధానాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల ప్రత్యేకత, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక బోధనపై స్పష్టత లేదన్నారు. వ్యవస్థలో మార్పుల ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల ప్రత్యేకత, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక బోధనపై స్పష్టత లేదన్నారు. వ్యవస్థలో మార్పుల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల మనుగడ, అధ్యాపకులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకం గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనంతో గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా బాలికలు, పేద, దళిత, గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతాయని పేర్కొన్నారు. పేదరికం, హాస్టళ్ల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి సమస్యలను పరిష్కరించకుండా విలీనాలతో డ్రాపౌట్లను తగ్గించలేరన్నారు.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, కళాశాలల యాజమాన్యాలతో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కల్లూరు ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల మనుగడ, అధ్యాపకులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల విలీనంతో గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ముఖ్యంగా బాలికలు, పేద, దళిత, గిరిజన విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతాయని పేర్కొన్నారు. పేదరికం, హాస్టళ్ల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి సమస్యలను పరిష్కరించకుండా విలీనాలతో డ్రాపౌట్లను తగ్గించలేరన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇంటర్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, కళాశాలల యాజమాన్యాలతో విస్తృత చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కల్లూరు ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.