BREAKING
ఆంధ్రప్రదేశ్ ప్లాంట్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు 12 వేల ఉద్యోగాల కల్పన అభివృద్ధి పనుల పరిశీలన 2026 విక్రయాల అంచనా పెంపు, అయితే కోలుకోవడం కష్టమేనని హెచ్చరిక కీలకమైన పండుగ సీజన్ అమ్మకాలపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న బూట్‌మేకర్ సెంట్రిస్ట్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్న ఈసీబీ చీఫ్ క్రిస్టియన్ లగార్డ్ పెరిగిన రక్షణ డిమాండ్‌తో ఫ్రీ క్యాష్ ఫ్లో అంచనాలను సవరించిన దిగ్గజ సంస్థ గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల జలాశయాల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి* టీడీపీ చేసిన అభివృద్ధి ప్రజల మనస్సును దోచించి ఈనెల 14న నర్సాయపల్లిలో దివంగత పాండుగౌడ్ సంస్మరణ సభ భూ రీసర్వే పనుల పరిశీలన మాస్కోకు చేరుకున్న అమెరికా రాయబారులు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ చిత్రగుప్త యాప్ ద్వారా మున్సిపల్ సేవలపై సమీక్ష.. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కౌలు రైతులకు బీమా పరిహారం అందించారు రాష్ట్రంలో ఫస్ట్ స్వచ్ఛ సిటీ గా అవార్డురావడం గర్వకారణం

వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Select Suryaa Now
వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లావైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుకొండ మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించిన అభ్యర్థులు కలిశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా సారథ్యంలో గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు బుధవారం రాత్రి జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులను రాజా జగన్ కు పరిచయం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురై నప్పటికీ రాజానగరం నియోజకవర్గంలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధిం చిన ఎంపీటీసీ సభ్యులతో పాటు జక్కంపూడి రాజాను అభినందించారు.అనంతరం ఎంపీటీసీ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కోరుకొండ మండలంలో జనసేన పార్టీ ఎంపీపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించిన పెన్నాడ సుమను జగన్ ప్రత్యేకంగా అభినందించారు.

జగన్‌ను కలిసిన వారిలో ఎంపీటీసీ సభ్యులు పట్నాల సత్యనారాయణ (కోటికేశవరం), నేతుల లక్ష్మీనారాయణ, వెంకట దుర్గా కళ్యాణి (కోరుకొండ-1), కొండము లక్ష్మి (కాపవరం), అనపర్తి మణికంఠ (బుచ్చంపేట), తుమ్మల లక్ష్మి (జగన్నాధపురం), మొకమాటి (జంబుపట్నం), గొడ్డు మహాలక్ష్మి, కర్రీ నాగదుర్గ వెంకటేశ్వరరావు (దోసకాయలపల్లి), దాడి శ్రీను (నిడిగట్ల) తదితరులు ఉన్నారు.