BREAKING
లగ్జరీ ఫ్యాషన్ రంగంలో బర్బెర్రీ పునరుజ్జీవనం మూడో త్రైమాసికంలో 0.7 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఓఎన్‌ఎస్ వెల్లడి ఆస్ట్రేలియాలోని మారుమూల షాపుతో ‘మెగాస్పీడ్’ కనెక్షన్లపై పెరుగుతున్న అనుమానాలు టెలిఫోనికా మూడో త్రైమాసిక ఫలితాల జోరు చైనా మార్కెట్ కేంద్రంగా సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వ్యూహాలు ఎలీసీ ప్యాలెస్‌లో కుప్పకూలిన ఫ్రెంచ్ గార్డు: సాయానికి పరుగెత్తిన అధ్యక్షుడు మాక్రాన్ ఇంటర్ విద్యా వ్యవస్థ రద్దుతో విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు: ఏఐవైఎఫ్ నేత కల్లూరు ధర్మేంద్ర అమెరికా బాటలోనే ఇరాన్ కూడా శాంతి అవకాశాలను వృథా చేసుకుందా? జురిచ్ ఇన్సూరెన్స్ సంచలన విజయం డ్రగ్స్ రవాణా అనుమానాలతో మాజీ జడ్జిపై బొలీవియా ఆడిట్ అలాస్కా ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థికి ఎదురుదెబ్బ ఏఐ బుకింగ్ ఏజెంట్ల విషయంలో వినియోగదారుల దారినే అనుసరించాలన్న మార్టిన్ సెయింట్ జార్జ్ బ్రూక్లిన్‌లో భవనం కూలి ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు రేపు కళ్యాణదుర్గం లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ.. బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా పునరాగమనం సాధ్యమేనా?: ప్రస్తుత రాజకీయ, న్యాయపరమైన పరిస్థితులపై విశ్లేషణ

విద్యార్థి అమరవీరుల ఆశయాలను సాధిద్దాం* *మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాల కోసం పోరాడుదాం.* *పీ డీ ఎస్ యూ*

Select Suryaa Now
విద్యార్థి అమరవీరుల ఆశయాలను సాధిద్దాం*  *మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాల కోసం పోరాడుదాం.*   *పీ డీ ఎస్ యూ*

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :  శాస్త్రీయ విద్యాసాధనకై ఉద్యమించాలని, విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ పిలుపునిచ్చారు. 

కణేకల్ మండలం డా"బి.ఆర్ అంబేద్కర్ గురుకులం (బాలుర ) పాఠశాల నందు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి 51వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లెల ప్రసాద్ పీ డీ ఎస్ యూ కణేకల్ మండల కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ  ఎమర్జెన్సీ చీకటి కాలంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను, ఆనాటి టీచర్ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యను విజయవాడలో అక్రమంగా అరెస్టు చేసి పట్టుకొచ్చి ఇల్లందు చీకటిగండ్లు అడవుల్లో దారుణంగా  కాల్చి చంపారని అన్నారు. జంపాల చంద్రశేఖర ప్రసాద్ ను చంపివేస్తే  ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ఉండదు అని కలలుగన్న రాజ్యం తన కలలు కలలుగానే మిగిలిపోయాయి. అని నేడు పీ డీ ఎస్ యూ దేశవ్యాప్తంగా విస్తరించి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల సాధన కోసం పోరాటం చేస్తుందన్నారు. కేవలం విద్యార్థి సమస్యల పరిష్కార పోరాటాల కోసమే పరిమితం కాకుండా కార్మిక, కర్షక,  ప్రజాస్వామిక, అస్తిత్వ, మహిళ, మైనార్టీ హక్కుల కోసం సాగే పోరాటంలో భాగస్వామ్యం అవుతుందన్నారు. విద్యా ప్రవేటీకరణ కార్పోరేటికరణతో నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదన్నారు. అనేక అవాంతరాలు నడుమ చదివినా కూడా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వాలు  అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణం అన్నారు. ఎస్ఐఆర్ ను తీసుకొచ్చి అక్రమంగా ఓట్లను తొలగించి ప్రజాస్వామిక విలువలకు పాతర వేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోతున్న నేటికీ విద్యారంగా సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయింది అన్నారు. పేద విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకపోవడంతో అనేకమంది విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపివేస్తున్నారన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి కొరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జార్జిరెడ్డి జంపాల చంద్రశేఖర ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ రంగవల్లి రమణయ్య స్నేహలత మారోజు వీరన్న లాంటి విద్యార్థులు విద్యార్థుల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కావాలని తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని వారి స్ఫూర్తితో వారు కలలు గన్న సమ సమాజం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలను విడనాడి విద్యార్థులకు మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 

 ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్, కణేకల్ మండల అధ్యక్షులు వన్నూరుస్వామి పీ డీ ఎస్ యూ నాయకులు మహీదర్, పవన్, శశిధర్, మైలర్, ఉమేష్, శారుణ్, ప్రదీప్, బలరాం, జగదీప్, మనోజ్, సంగీత్ర, చిన్న, అనిల్, జయ్ లక్షమన్, కమలాకర్, వినయ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్