భక్తి శ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంభక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి అయ్యప్ప పడి పూజ కార్యక్రమం రాజమహేంద్రవరంలో వైభవంగా జరిగింది.
56వ డివిజన్ ఇన్‌ఛార్జ్ కూరం అప్పారావు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్‌ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ...ప్రతి సంవత్సరం స్వామి అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పడి పూజ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం, ఈ పవిత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అదేవిధంగా ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో కన్నెస్వాములు, అయ్యప్ప మాలధారులు భక్తిశ్రద్ధలతో శబరిమల యాత్ర చేపట్టి స్వామివారిని దర్శించుకోవడం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమన్నారు.అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఇంతటి పవిత్రమైన పడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని అనుశ్రీ సత్యనారాయణ పేర్కొన్నారు. పడిపూజ కార్యక్రమానికి జనసేన నాయకులు గెడ్డం నాగరాజు గుర్తులు సత్యనారాయణ దూడల శ్రీను, తలారి శ్రీను, కారుమూరి పరమేష్ ,రోకం రాజేష్, హేమ దుర్గా పిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి