తిరుమల నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ
పలమనేరు మేజర్ న్యూస్ తిరుమల శ్రీ వేంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి పలమనేరు రూరల్ మండలం మొరం గ్రామానికి చెందిన రమేష్ తన కుటుంబ సభ్యుల సహకారంతో 10 టన్నుల కూరగాయలను విరాళంగా అందించారు. కాప్పల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కూరగాయలను తిరుమలకు తరలించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండీ యజమానులు, దాతలు పాల్గొని సహకరించారు. నిత్యాన్నదాన కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను అందించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
రిపోర్టర్ : అనిల్ కుమార్ యాదవ్