డివిజన్ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న యంగ్ డైనమిక్ కార్పొరేటర్ కోనంకి స్నేహ ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అడుగులు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : గెలిచిన వెంటనే ప్రజలతో మమేకమవుతూ, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు 40వ డివిజన్ యంగ్ డైనమిక్ కార్పొరేటర్ కోనంకి స్నేహ. ఎన్నికల తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ, ప్రజల మధ్యే స్నేహపూర్వకంగా తిరుగుతూ ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇందులో భాగంగానే నేడు 40వ డివిజన్‌లో పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. డివిజన్‌లోని ప్రతి గడపకూ తిరుగుతూ అక్కడి స్థానిక సమస్యలను, ముఖ్యంగా పారిశుధ్య ఇబ్బందిని ఆమె స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారుల సహకారంతో వెంటనే తగు పరిష్కార చర్యలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కోనంకి స్నేహ మాట్లాడుతూ.. "పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు నేను నిరంతరం కృషి చేస్తూ ముందడుగు వేస్తున్నాను. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే నా బాధ్యత" అని తెలిపారు. డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తున్న కోనంకి స్నేహ తీరు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్