రష్మిక వంట చేస్తే యుద్ధమే.. రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం రణబాలి. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ సుమతో కలిసి ఈ జోడీ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక వంట నైపుణ్యాలపై విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సరదాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రష్మిక వంట చేస్తే అది ఓ యుద్ధం చేసినట్లే ఉంటుందని ఆయన అనడం సెట్‌లో నవ్వులు పూయించింది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు సుమ చేసే సందడి ఈ ఇంటర్వ్యూకు ప్రధాన నిలిచింది. ఇద్దరిని కలిపి చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉందని సుమ ప్రశంసలు కురిపించడం, అందుకు సంబంధించిన ప్రోమో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో పూర్తి ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
చిత్రం విశేషాల విషయానికి వస్తే, 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి యోధుడి పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన రష్మిక నటిస్తోంది. సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే చిత్రబృందం నాలుగు భాగాలుగా ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసి అంచనాలను తారాస్థాయికి చేర్చింది. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పెళ్లి తరువాత ఈ జంట నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.