BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

ఉజ్వల్ నికమ్ బయోపిక్ ట్రైలర్ విడుదల.. టెర్రరిస్ట్ దాడి జరిగిన చోటే ఈవెంట్!

Select Suryaa Now
 ఉజ్వల్ నికమ్ బయోపిక్ ట్రైలర్ విడుదల.. టెర్రరిస్ట్ దాడి జరిగిన చోటే ఈవెంట్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ప్రహార్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌‌ను విడుదల చేశారు. 2008 నవంబర్ 26న ముంబైలో పాక్ ఉగ్రవాదులు జరిపిన భయానక మారణకాండ మరియు ఆ చారిత్రక కేసును ఉజ్వల్ నికమ్ ఏ విధంగా వాదించి అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడేలా చేశారనే కీలక ఘట్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అత్యంత ప్రత్యేకంగా నిర్వహించడం విశేషం. సరిగ్గా ఉగ్రదాడి జరిగిన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ ప్రాంగణంలోనే ఈ సినిమా ట్రైలర్‌‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో 26/11 దాడుల భీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో పాటు, కోర్టులో జరిగే వాదోపవాదాలు ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా ఉన్నాయి. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు నటన సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తుండగా, ఆయన సరసన వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి న్యాయమూర్తిగా, లలిత్ ప్రభాకర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌గా, సికందర్ ఖేర్ లాయర్‌గా మరియు జైదీప్ అహ్లావత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రముఖ దర్శకుడు అవినాశ్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఉగ్రవాదంపై సాగిన అత్యంత కీలకమైన పోరాటాన్ని, కోర్టు రూమ్ డ్రామాను వాస్తవిక దృక్పథంతో ఆవిష్కరిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తో ఒక్కసారిగా అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ న్యూ ఏజ్ బయోపిక్ డ్రామా అక్టోబర్ 16న బాక్సాఫీస్ వద్ద గ్రాండ్‌గా విడుదల కానుంది.