BREAKING
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు! గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్! జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యామీ గౌతమ్ సందడి 'ఆర్టికల్ 370' చిత్రానికి ప్రశంసలు అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి

తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల!

Select Suryaa Now
తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: 'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా, నక్షత్ర కథానాయికగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'తెల్లకాగితం'. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభించగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఒక స్వచ్ఛమైన టీనేజ్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. స్కూల్ రోజుల్లో మొదలైన ప్రేమ కథ చివరికి ఎలాంటి మలుపులు తిరిగింది, తెలిసి తెలియని చిన్న వయసులో ప్రేమలో పడి చేసే ఒక్క చిన్న తప్పు తెల్లకాగితం లాంటి జీవితాన్ని ఎలా మార్చేస్తుందనే ఆసక్తికరమైన కోణంలో దర్శకుడు ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. "ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది" అనే డైలాగ్ కథాంశం యొక్క గాఢతను చాటిచెబుతోంది.  

విజయ్ బుల్గానిన్ అందించిన మధురమైన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. యౌవనంలో ఎదురయ్యే భావోద్వేగాలు, ప్రేమికుల ప్రయాణాన్ని హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.