సూర్య కొత్త సినిమా 'సీన్' గ్లింప్స్ విడుదల: వైవిధ్యమైన సైకో పోలీస్ పాత్రలో స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విభిన్నమైన ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘సీన్’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘సింగం’ వంటి మాస్ చిత్రాల్లో పవర్‌ఫుల్ మరియు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను అలరించిన సూర్య, ఈసరిదికి పూర్తి భిన్నంగా ‘DSP ఇన్‌బ్రాజ్’ అనే ఒక రకమైన సైకో తరహా నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీసు పాత్రలో కనిపించనున్నారు.
‘ఆవేశం’ వంటి సంచలన చిత్రాల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో సూర్య బాడీ లాంగ్వేజ్, ఆయన ప్రవర్తించే తీరు చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. గత చిత్రాలకు పూర్తి విరుద్ధంగా నెగ్లెక్టెడ్ మరియు రూడ్ బిహేవియర్ ప్రదర్శించే క్యారెక్టర్‌లో సూర్య అభినయం సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. గ్లింప్స్‌తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన సూర్య, పూర్తి చిత్రంతో ఏ స్థాయిలో అలరిస్తారో వేచి చూడాలి.