BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా చిత్రం మైసా టీజర్ విడుదల వేడుక నగరంలో అత్యంత వైభవంగా జరిగింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రష్మిక గోండు గిరిజన మహిళగా మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు మాస్ అవతారంలో అలరించనున్నారు. ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, రష్మిక విరచిత పెర్ఫార్మెన్స్, జేక్స్ బిజోయ్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని మరియు అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. మైసా సినిమా కోసం తాను కేవలం నటన మాత్రమే కాకుండా తన లైఫ్‌నే రిస్క్‌లో పెట్టి పనిచేశానని వెల్లడించారు. కేరళలోని దట్టమైన అడవులు, జలపాతాలు, కొండ ప్రాంతాల్లో రియల్ స్టంట్స్ చేశానని, నీటి అడుగున రోజుకు ఎనిమిది గంటల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. అలాగే మట్టి బురదలో సాగే సాహసోపేతమైన పోరాట ఘట్టంలో నటిస్తున్నప్పుడు తనకు తీవ్రమైన హిప్ ఇంజ్యూరీ అయిందని, డాక్టర్లు కూడా ఫుట్‌బాల్ ప్లేయర్‌కు అయ్యేంత పెద్ద గాయమని చెప్పారని వివరించారు.

తమ దర్శకుడు రవీంద్ర ఏ సీన్‌లోనూ డూప్‌ను వాడకుండా ప్రతీ సన్నివేశాన్ని రియల్‌గా చేయించారని, దాంతో లైఫ్‌లోనే మొదటిసారి షూటింగ్‌కు వెళ్లాలంటే వణుకు పుట్టిందని రష్మిక నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తనను క్యూట్, స్వీట్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులకు ఈ చిత్రంలో ఫేస్ మీద బ్లడ్‌తో కంప్లీట్ మాస్ రూపంలో సరికొత్త రష్మిక కనిపిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.