BREAKING
గంగవరంలో ఎల్లంపల్లి మురళి ఘన విజయం 1080 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు బిర్యానీ తినాలంటూ పరిచయం.. నిర్మానుష్య ప్రాంతంలో బెదిరించి దోపిడీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని సన్మానించిన కూర్మాయి సర్పంచ్ విజయ మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్

జైలర్ 2 మూవీ అప్‌డేట్: రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ నటి విధ్యా బాలన్.. పవర్‌ఫుల్ 'కాంత' పాత్ర రివీల్

Select Suryaa Now
జైలర్ 2 మూవీ అప్‌డేట్: రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ నటి విధ్యా బాలన్.. పవర్‌ఫుల్ 'కాంత' పాత్ర రివీల్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, వర్సటైల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యా బాలన్ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

జైలర్ 2 చిత్రంలో విద్యా బాలన్ 'కాంత' అనే అత్యంత పవర్‌ఫుల్ మరియు తీవ్రమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. నేడు విడుదల చేసిన క్యారెక్టర్ గ్లింప్స్‌లో ఆమె నీలం రంగు చీర ధరించి, చేతిలో సిగరెట్ పట్టుకుని మెట్లపై నుంచి కిందకు దిగుతూ ఊరమాస్ అవతారంలో దర్శనమిచ్చారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు "ఇక్కడికి వచ్చాక మేం చెప్పేది వినకుండా ఊరికే వెళ్లలేరు" అని విద్యా బాలన్ చెప్పే పవర్‌ఫుల్ తమిళ డైలాగ్ నెటిజన్లను, రజినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కథలో రజినీకాంత్ పోషిస్తున్న 'టైగర్ ముత్తువేల్ పాండియన్' పాత్రతో విద్యా బాలన్ ముఖాముఖి తలపడనున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ సీక్వెల్‌లో ఇప్పటికే ఎస్‌జే సూర్య 'బోధి' పాత్రలో, మలయాళ నటుడు సురాజ్ వెంజారమూడు 'దిలీప్' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా ఇప్పుడు విద్యా బాలన్ కూడా కాంత పాత్రలో తోడవడంతో జైలర్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా తమ పాత పాత్రలనే కొనసాగిస్తుండగా, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ప్రత్యేక పాత్రల్లో అలరించనున్నారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది.