BREAKING
మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన భూ రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి గురుకుల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల సాధ్యం కాదు : కలెక్టర్

డిసెంబర్ 11న థియేటర్లలోకి ‘పారడాక్స్ హరికథ’.. ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు!

Select Suryaa Now
డిసెంబర్ 11న థియేటర్లలోకి ‘పారడాక్స్ హరికథ’.. ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన తాజా తెలుగు చిత్రం ‘పారడాక్స్ హరికథ’ విడుదలకు సిద్ధమైంది. ఐరావత సినీ కలర్స్, అ‌గ్‌మైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కడ్లూరి అశోక్, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్‌కే) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ‘గుప్పెడంత ప్రేమ’ అనే మెలోడీ ప్రేమ గీతాన్ని చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది.

ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు రాని ఒక వినూత్నమైన అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. చిన్న చిత్రాల విజయాల జాబితాలో ‘పారడాక్స్ హరికథ’ కచ్చితంగా చేరుతుందని, డిసెంబర్ 11న విడుదల కానున్న తమ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. నిర్మాత అశోక్ కడ్లూరి మాట్లాడుతూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ గొప్ప కథాంశంతో అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రం రూపొందిందని, చిత్ర బృందం పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు మహవీర్ ఈ చిత్రానికి చక్కటి బాణీలు అందించినట్లు పేర్కొన్నారు.

నటీనటులు కేదార్ శంకర్, అంబరీష్ ఈ వేడుకలో పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక అంశాలను ప్రస్తుత తరానికి అనుగుణంగా జోడించి సందేశాత్మకంగా తీర్చిదిద్దిన తీరు బాగుందని వారు ప్రశంసించారు. నటి అఖిల రామ్ మాట్లాడుతూ, గతంలో ‘మసూద’ చిత్రంలో ముసుగులో కనిపించిన తాను ఈ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలో అలరించనున్నట్లు చెప్పారు. గతాన్ని, వర్తమానాన్ని అద్భుతంగా అనుసంధానిస్తూ సాగే ఈ కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని హీరో కిరణ్, నటుడు మన్యం భాస్కర్, లావణ్య రెడ్డి వివరించారు. మీడియా మరియు ప్రేక్షకుల మద్దతుతో ఈ చిన్న చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.