దీపావళి బరిలో లేడీ సూపర్ స్టార్ ‘మూకుత్తి అమ్మన్-2’.. పండుగ సందడి మరింత క్యూట్!
టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన నటనతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’. గతంలో ఘన విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. తెలుగులో ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నయనతార మరోసారి శక్తివంతమైన దేవత పాత్రలో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు.
అన్ని హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని మరింత పెంచేలా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. సీనియర్ దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ దీపావళి రేసులో నిలవనుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.