నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న చిత్రం!
సూర్యా న్యూస్ డెస్క్
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్' షూటింగ్ పనులు ముగిశాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నిర్మాణ దశ నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈ కొత్త సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాగా, తాజా నివేదికల ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అన్నీ షెడ్యూల్ ప్రకారమే కంప్లీట్ అయ్యాయని తెలుస్తోంది. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ తేదీపై కూడా స్పష్టత వచ్చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 24న ఈ సినిమాను భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాని కెరీర్‌లోనే డిఫరెంట్ మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది.