BREAKING
సేవా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టుల రక్తదాన శిబిరం సినిమా, టీవీ, నాటక రంగాలకు నంది అవార్డులు.. ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. భరత్ భూషణ్ ప్రకటన! నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..

సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబు!

Select Suryaa Now
సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్ కాళికా మిస్సింగ్'. సత్య ధనేకుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. పూర్తి సస్పెన్స్, ఉత్కంఠభరితమైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. మునుపెన్నడూ చూడని వినూత్నమైన కథానంతో ఈ సినిమా చిత్రీకరణ ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సంగీత పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మంచి మార్కులు సాధిస్తుందని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో ఎస్తేర్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, ఆలీ, జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తవ్వడంతో, ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.