కిరణ్ అబ్బవరం సమర్పణలో ‘హతః’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పిస్తున్న కొత్త సినిమా ‘హతః’ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాణ రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకుపోతున్నారు. కేఏ ప్రొడక్షన్స్ మరియు పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘హతః’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టైటిల్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ సర్కిల్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కీలక ప్రకటన చేసింది. ‘హతః’ చిత్రానికి సంబంధించిన అధికారిక టీజర్‌ను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రానికి అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తుండగా, శివశంకర నాయుడు.వై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇందులో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, రానున్న టీజర్ సినిమా అసలు కథాభాగాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.