BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరహా చిత్రం ‘డెలులు’: సెప్టెంబర్ 3న టీజర్ విడుదల

Select Suryaa Now
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరహా చిత్రం ‘డెలులు’: సెప్టెంబర్ 3న టీజర్ విడుదల

ప్రస్తుత యువత ట్రెండ్‌కు తగినట్లుగా పూర్తిగా కొత్త తరహా కథాంశంతో వస్తున్న సినిమా ‘డెలులు’. సోషల్ మీడియాలో, ముఖ్యంగా జెన్-జెడ్ (Gen-Z) ట్రెండ్స్‌లో విపరీతంగా వినిపిస్తున్న ‘డెలూషనల్’ (Delusional) అనే పదం ఆధారంగా ఈ టైటిల్‌ను ఖరారు చేశారు. ఊహలకు, వాస్తవానికి మధ్య నడిచే ఆసక్తికరమైన భావోద్వేగాలను ఈ చిత్రంలో వెండితెరపై ఆవిష్కరించనున్నారు. తాజాగా ఓ ప్రతిష్టాత్మక కాలేజీ స్టూడెంట్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ఈ క్రేజీ టైటిల్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేసింది.

క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రీతం కస్తూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ రాజ్‌కుమార్ కథ అందించడంతో పాటు అదనపు సంభాషణలు రాశారు. అలాగే రెష్మిత్ ఎస్ కౌశిక స్క్రీన్‌ప్లే, మాటలు సమకూరుస్తుండగా, జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ, హరికృష్ణ కురపాటి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆది చెబ్రోలు సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

యూత్‌ను పూర్తిగా ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక టీజర్ సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ట్రెండింగ్ టైటిల్, కొత్త తరహా మేకింగ్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, యువతలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.