BREAKING
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు! గణేష్ నిమజ్జనం: మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్! జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యామీ గౌతమ్ సందడి 'ఆర్టికల్ 370' చిత్రానికి ప్రశంసలు అవకాడో సాగుపై కలెక్టర్ ప్రశంసలు తెల్లకాగితం ట్రైలర్: టీనేజ్ లవ్ స్టోరీతో అలరిస్తున్న హర్ష్ రోషన్.. గాంధీ జయంతికి విడుదల! ఘనంగా వరసిద్ధి వినాయక నిమజ్జనం వేలంపాటల్లో భక్తుల పోటాపోటీ.. భారీ ధరలకు లడ్డూ, వెండి వస్తువులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న డా. చినుకని శివ ప్రసాద్ 50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్‌ రూపం Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ పులివెందులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు పనులు చేసి చూపించాలి

Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్

Select Suryaa Now
Dont Trouble The Trouble: ఆసక్తికరంగా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ చిత్రాలతో పాటు 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

విడుదలైన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అల్లావుద్దీన్ మ్యాజిక్ స్టైల్‌లో మాయలు, మంత్రాలు తెలిసిన ఒక చిన్న పాప.. హీరో జీవితంలోకి ఎలా ప్రవేశించింది? ఆమె రాకతో అతని జీవితంలో ఎదురైన చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఏమిటి? అనే విషయాలను దర్శకుడు ఎంతో కామెడీగా, వినోదాత్మకంగా ట్రైలర్‌లో చూపించారు.

రిచ్ విజువల్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే మలయాళంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఫహాద్ ఫాజిల్.. ఈ ఫాంటసీ కామెడీ చిత్రంతో స్ట్రెయిట్ తెలుగు హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలని టాలీవుడ్ వర్గాలు మరియు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.