BREAKING
నేటి పంచాంగం: 30 సెప్టెంబర్ 2026, బుధవారం పంచాంగ విశేషాలు, శుభాశుభ సమయాలు ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత.. జడ్పీ చైర్మన్ రేసులో నేనూ ఉంటా….! రూ.5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ వైద్యుడు: విజిలెన్స్ వలలో ఉత్తరాఖండ్ డాక్టర్ క్రేన్ బోల్తా ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్ పద్మారావు నగర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సిరిసిల్లకు నేడు సీఎం రేవంత్.. భారీ సభకు ఏర్పాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొరపాట్లు.. వంటగదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అపూర్వ మధ్య తీవ్ర వాగ్వాదం.. నువ్వు చేసే పనులకు ఇరిటేటింగ్‌గా ఉందంటూ ఆగ్రహం నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమాపై క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే? డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలి.. ఎన్టీఆర్ ఆకాంక్ష! అల్లిపూర్ సర్పంచ్ వీరేశం మృతి నాగచైతన్య ఎన్ సీ ఇద్దరు సినిమాపై రూమర్స్.. స్పష్టతనిచ్చిన చైతూ టీమ్!

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలి.. ఎన్టీఆర్ ఆకాంక్ష!

Select Suryaa Now
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలి.. ఎన్టీఆర్ ఆకాంక్ష!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అన్-వెయిటెడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించడమే కాకుండా సినిమా ఘన విజయం సాధించాలని మనసారా ఆకాంక్షించారు. ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకుని పబ్లిక్ ఈవెంట్‌కు విచ్చేసిన తారక్‌‌ను చూసి అభిమానులు ఆనందంతో ఉర్రూతలూగారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణ అందించగా, శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. ఆర్కా మీడియా వర్క్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు.

ఈ వేడుకలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ, నిర్మాతగా ఇది తన తొలి సినిమా అయినప్పటికీ దర్శకుడు శశాంక్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని తెలిపారు. అలాగే నోరువిప్పి అడగకుండానే కేవలం ఒక్క మాటతో తమ ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన తారక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రంలోని ప్రధాన ఘట్టాలను హైదరాబాద్‌లోని డెబ్బై ఐదు రియల్ లొకేషన్స్‌లో ఎంతో కష్టపడి షూట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు శశాంక్, సంగీత దర్శకుడు కాలభైరవ, దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు మరియు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటూ చిత్ర విజయంపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రీ-రిలీజ్ వేడుకలో భాగంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ, శశాంక్ తనకు మూడు గంటల కథ చెప్పిన క్షణంలోనే సినిమాపై నమ్మకం కుదిరిందని, ఈ సినిమా చూసి తాను కూడా భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు. ఫహాద్ ఫాజిల్ అద్భుతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఫహాద్ ఫాజిల్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశం గర్వించదగ్గ నటుడిగా ఆయన తెలుగులో మొదటిసారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. తన తమ్ముడు కార్తికేయ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించిన తారక్, త్వరలోనే తన తదుపరి చిత్రమైన డ్రాగన్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు స్పష్టం చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.