BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

దివ్యభారతి ఫోటోలు ఏఐతో మార్ఫ్.. నిజమనుకున్న నెటిజన్లు షాక్

Select Suryaa Now
దివ్యభారతి ఫోటోలు ఏఐతో మార్ఫ్.. నిజమనుకున్న నెటిజన్లు షాక్

హైదరాబాద్:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నిజమైన ఫొటోలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలను గుర్తించడం సవాల్‌గా మారుతోంది. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటు దుర్వినియోగం చేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ నటీమణుల ఫొటోలను ఏఐ టూల్స్‌తో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నటి దివ్యభారతి ఫొటోల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళ చిత్రం బ్యాచిలర్తో హీరోయిన్‌గా పరిచయమైన దివ్యభారతి, తొలి సినిమాతోనే నటనతో పాటు గ్లామర్‌తోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అనంతరం పలు తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దివ్యభారతి తరచూ తన ఫ్యాషన్ స్టిల్స్, ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు.

ఇటీవల ఆమె ఆకుపచ్చ రంగు డిజైనర్ దుస్తుల్లో దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఒరిజినల్ ఫొటోలను కొందరు ఏఐ డీప్‌ఫేక్ టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒరిజినల్ దుస్తులను తొలగించి, ఆమె ఎరుపు రంగు బికినీలో ఉన్నట్లుగా కనిపించేలా ఫొటోలను మార్చినట్లు తెలుస్తోంది.

ఏఐ సాంకేతికతను ఉపయోగించి మార్ఫింగ్ చేయడంతో ఆ చిత్రాలు తొలిచూపులో నిజమైనవిగా కనిపించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు చెబుతున్నారు. దీంతో కొందరు వాటిని చూసి షాక్‌కు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలపై స్పందిస్తూ.. నిజమే అనుకున్నాం కదరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి ఫొటోనూ నిజమైనదిగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల ఫొటోలను ఏఐతో మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రచారం చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి కంటెంట్ కనిపించినప్పుడు దాన్ని ఇతరులకు షేర్ చేయకుండా, ఫొటో నిజమైనదేనా? అనే విషయాన్ని విశ్వసనీయమైన మూలాల ద్వారా నిర్ధారించుకోవడం మంచిది.