BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

దేవర 2 సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనా.. తారక్, కొరటాల శివ సీక్వెల్‌పై లేటెస్ట్ బజ్

Select Suryaa Now
దేవర 2 సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేనా.. తారక్, కొరటాల శివ సీక్వెల్‌పై లేటెస్ట్ బజ్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం దేవర థియేటర్లలో విడుదలై నిన్నటితో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ట్రెండ్స్ గట్టిగా నడుస్తుండగా, మరోవైపు దేవర 2 సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన రూమర్స్ సినీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభం కానుందనే దానిపై అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఆఖర్లో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తియిన తర్వాతే దేవర సీక్వెల్‌ను అధికారికంగా ప్రారంభించాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలావరకు పూర్తయ్యాయని, మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ మరింత హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కథా చర్చలు పూర్తి కావడంతో కేవలం షూటింగ్ ప్రారంభం కావడమే తరువాయి అని తెలుస్తోంది.

దేవర మొదటి భాగం క్రియేట్ చేసిన అంచనాలకు తగ్గట్టుగానే సీక్వెల్‌ను అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ పరంగా మరింత బలమైన భావోద్వేగాలు, ఊహించని ట్విస్టులతో ఈ చిత్రం సాగనుందని సమాచారం. తారక్ లైనప్‌లో ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే దేవర 2 సెట్స్‌పైకి వెళ్లనుండటంతో అప్పటివరకు అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఈ సీక్వెల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.