BREAKING
థియేటర్ల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: ఐదేళ్ల కాలపరిమితితో సింగిల్ విండో లైసెన్స్‌లు - ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్! 'టార్టాయిస్' ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ, థియేటర్స్‌లో కంప్లీట్ ఎంగేజ్‌మెంట్: హీరో రాజ్ తరుణ్! విద్యార్థుల, యువత సదస్సు స్థలాన్ని పరిశీలించిన గంగుల కమలాకర్ ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులు నేను చేసి చూపిస్తా... లేకుంటే రాజీనామా చేస్తా: నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన! దీపావళి తర్వాత పెళ్లి పీటలెక్కనున్న అనిరుధ్ - కావ్య మారన్? విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్! 'డెలులు' టీజర్ లాంచ్: చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - హీరో విజయ్ రాజ్‌కుమార్! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా 'చకోర' టీజర్ రిలీజ్: అక్టోబర్ 8న గ్రాండ్ థియేటర్స్‌లోకి లవ్ బర్డ్స్! Jailer 2: వాయిదా వార్తలకు పటాపంచలు.. పక్కా ప్లాన్‌తోనే రజినీకాంత్ 'జైలర్ 2' వేట! అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి: నవంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు! బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే? మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ: సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ షురూ! వేణు ఊడుగుల సమర్పణలో 'చంద్రయాన్' మోషన్ పోస్టర్ రిలీజ్: సొంతంగా రాకెట్ తయారు చేసిన ముగ్గురు కుర్రాళ్ల సాహస యాత్ర! పేద ప్రజలకు కొండంతాండ సీఎం సహాయ నిధి శ్రీకృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్: మార్కండేయుడిగా నటుడు బ్రహ్మాజీ కొత్త గెటప్ వైరల్! కొండా సురేఖ రాజీనామా.. ఇక ఉప ఎన్నిక తప్పదా? వరంగల్ తూర్పులో రాజకీయ సమీకరణాలు ఎటు?

బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?

Select Suryaa Now
బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ రివ్యూ: ఏజ్‌ గ్యాప్‌ లవ్‌స్టోరీ ఎలా ఉందంటే?

నటీనటులు: నివిన్‌ పౌలి, మమిత బైజు, సంగీత్‌ ప్రతాప్‌, సురేశ్‌ కృష్ణ, వినయ్‌ ఫోర్ట్‌, రోషన్‌ షానవాస్‌ తదితరులు
నిర్మాతలు: దిలీష్‌ పోతన్‌, ఫహద్‌ ఫాజిల్‌, శ్యామ్‌ పుష్కరన్‌
దర్శకత్వం: గిరీశ్‌ ఏడీ
సంగీతం: విష్ణు విజయ్‌
సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ సాబు
తెలుగు విడుదల: మైత్రీ మూవీ రిలీజ్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 4, 2026

మలయాళ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. అక్కడ మంచి విజయం సాధించిన సినిమాలను తెలుగులోకి తీసుకొచ్చే ట్రెండ్‌ కూడా ఇటీవల మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ చిత్రం ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’.

ఓనమ్‌ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. భారీ వసూళ్లతో విజయవంతమైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ‘ప్రేమలు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గిరీశ్‌ ఏడీ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సినిమా కథేంటి? నటీనటుల ప్రదర్శన ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే..

జస్టిన్‌ (నివిన్‌ పౌలి) తన సొంత ఊరిలో క్యాటరింగ్‌ వ్యాపారం చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా కొనసాగిస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మాటలు అన్నా వాటిని పెద్దగా పట్టించుకోడు.

ఇలాంటి సమయంలో జస్టిన్‌ ఇంటి పక్కనే ఓ కొత్త కుటుంబం వచ్చి స్థిరపడుతుంది. ఆ కుటుంబానికి చెందిన ఆష్లే (మమిత బైజు) జస్టిన్‌ను ఇష్టపడుతుంది. మొదట అతడితో స్నేహం పెంచుకున్న ఆమె.. క్రమంగా అతని వ్యక్తిత్వానికి ఆకర్షితురాలై ప్రేమలో పడుతుంది.

అయితే వీరిద్దరి మధ్య వయసులో దాదాపు 13 ఏళ్ల తేడా ఉంటుంది. కాలేజీ చదువుతున్న ఆష్లే తనను ప్రేమిస్తోందని తెలుసుకున్న జస్టిన్‌ కూడా ఆమెపై మనసు పారేసుకుంటాడు. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియకుండా కొంతకాలం గోప్యంగా ఉంచాలని ఇద్దరూ నిర్ణయించుకుంటారు.

కానీ ఓ అనుకోని పరిణామంతో వీరి రహస్య ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలకు తెలిసిపోతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంటుంది? ఈ వయసు తేడా ఉన్న ప్రేమను వారు అంగీకరిస్తారా? జస్టిన్‌, ఆష్లే తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? చివరకు ఏం జరిగింది? అనేదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే..

పెద్ద బడ్జెట్‌, భారీ సెట్లు, స్టార్‌ హీరోలు ఉంటేనే సినిమా గొప్పగా ఉంటుందనే భావనకు భిన్నంగా.. ఓ సాధారణ కథను కూడా సహజమైన కథనంతో ఆకట్టుకునేలా చెప్పొచ్చని మరోసారి నిరూపించే ప్రయత్నం చేసింది ఈ చిత్రం.

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’లో కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. వయసులో తేడా ఉన్న ఓ జంట ప్రేమలో పడటం అనే పాయింట్‌ కొత్తదేమీ కాదు. కానీ దర్శకుడు గిరీశ్‌ ఏడీ దాన్ని తెరకెక్కించిన విధానం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

‘ప్రేమలు’ తరహాలోనే ఈ సినిమాలోనూ సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పాత్రలు, వారి మాటలు, చిన్న చిన్న సంఘటనలు.. అన్నీ మన చుట్టూ జరిగే విషయాల్లానే అనిపిస్తాయి. అందుకే సినిమా చూస్తున్నంతసేపు పాత్రలతో పాటు మనం కూడా ప్రయాణిస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది.

ప్రారంభ భాగం కొంత నెమ్మదిగా అనిపించినప్పటికీ.. జస్టిన్‌, ఆష్లే పరిచయం అయిన తర్వాత కథలో ఆసక్తి పెరుగుతుంది. వారి స్నేహం ప్రేమగా మారే విధానం కూడా చాలా సహజంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలు, ఇద్దరి మధ్య జరిగే చిన్నపాటి సంభాషణలు ఆకట్టుకుంటాయి.

జస్టిన్‌ తమ్ముడు షార్ట్‌ఫిల్మ్‌ మేకింగ్‌ చేసే ఎపిసోడ్‌ సినిమాలో మంచి కామెడీని పండిస్తుంది. ఆష్లే జస్టిన్‌కు తన ప్రేమను చెప్పే సన్నివేశం కూడా బాగా వర్కౌట్‌ అయింది.సెకండాఫ్‌లో ప్రధానంగా జస్టిన్‌, ఆష్లే ప్రేమకథ చుట్టూనే కథ తిరుగుతుంది. ఎవరికీ తెలియకుండా కలుసుకోవడం, చిన్న చిన్న అపార్థాలు, అలకలు, కాలేజీకి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయి.

అయితే వీరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత కథలో అసలు సమస్య మొదలవుతుంది. ఈ దశలో కథను మరింత ఎమోషనల్‌గా తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఎక్కువగా కామెడీ వైపు మొగ్గు చూపాడు. జంటను కలపడానికి జస్టిన్‌ స్నేహితులు చేసే ప్రయత్నాలు మంచి నవ్వులు తెప్పిస్తాయి.

హీరో ప్రేమకథలోని భావోద్వేగాలను లోతుగా చూపించకుండా.. అతని తమ్ముడి ప్రేమకథకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్ని చోట్ల ప్రధాన కథనం కాస్త పలుచగా అనిపిస్తుంది. అయినప్పటికీ కామెడీ, సహజమైన సన్నివేశాలు ఆ లోటును చాలా వరకు భర్తీ చేస్తాయి.

క్లైమాక్స్‌ మాత్రం కొంత సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా పూర్తయ్యే సమయానికి ఓ హాయిగా, సరదాగా సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.నటీనటుల పనితీరు ఎలా ఉందంటే..

జస్టిన్‌గా నివిన్‌ పౌలి తన నటనతో ఆకట్టుకున్నాడు. స్టార్‌ హీరో ఇమేజ్‌ను పక్కన పెట్టి ఓ సాధారణ వ్యక్తిలా తెరపై కనిపించాడు. ముఖ్యంగా ఆష్లే తనను ప్రేమిస్తున్న విషయం తెలిసినప్పుడు అతని హావభావాలు చాలా సహజంగా అనిపిస్తాయి.

ప్రేమలో పడిన వ్యక్తిలో కనిపించే సంకోచం, అయోమయం, ఆనందం, తన భావాలను బయటపెట్టే సమయంలో ఉండే ఇబ్బంది.. ఇలా ప్రతి ఎమోషన్‌ను నివిన్‌ చక్కగా ప్రదర్శించాడు.ఆష్లే పాత్రలో మమితా బైజు కూడా మెప్పించింది. తన పాత్రకు అవసరమైన అమాయకత్వంతో పాటు ప్రేమలో ఉన్న యువతిగా ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆకట్టుకుంటాయి. నివిన్‌, మమితల మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది.

హీరో తమ్ముడి పాత్రలో సంగీత్‌ ప్రతాప్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. రోషన్‌ షానవాస్‌ కూడా కీలకమైన సందర్భాల్లో కామెడీ పండించాడు. సురేశ్‌ కృష్ణ, వినయ్‌ ఫోర్ట్‌ సహా మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా..సాంకేతికంగా సినిమా మంచి స్థాయిలో ఉంది. విష్ణు విజయ్‌ అందించిన సంగీతం కథకు చక్కగా సరిపోయింది. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల ప్రభావాన్ని మరింత పెంచుతుంది. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి.

అజ్మల్‌ సాబు సినిమాటోగ్రఫీ మరో ప్రత్యేక ఆకర్షణ. కేరళ గ్రామీణ ప్రాంతాల అందాలను సహజంగా చూపించడంతో పాటు గోవా లొకేషన్స్‌ను కూడా అందంగా చిత్రీకరించారు.ఎడిటింగ్‌ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలను కాస్త కుదించి ఉంటే సినిమా మరింత వేగంగా అనిపించేది. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి.

చివరిగా..‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’లో కథ చాలా సింపుల్‌. కానీ ఆ కథను సహజమైన సన్నివేశాలు, చక్కటి కామెడీ, మంచి నటనతో దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. ప్రేమకథలో డెప్త్‌ కొంత తక్కువగా అనిపించినా.. వినోదం విషయంలో సినిమా నిరాశపరచదు.

సింపుల్‌ లవ్‌స్టోరీ, సహజమైన కామెడీ, నివిన్‌ పౌలి–మమితా బైజు కెమిస్ట్రీని ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఛాయిస్‌.