BREAKING
అమెరికాతో వివాదానికి తెరపడిన వేళ గ్రీన్‌లాండ్‌ జాతీయ పతాకం ప్రత్యేకతలివే: మంచు గడ్డపై అస్తమించని సూర్యుడి చిహ్నం రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ...రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గంటకు 350 కిలోమీటర్ల వేగం.. జపాన్‌కు సరిసాటిగా భారత్‌లోనే వేగవంతమైన బుల్లెట్ రైలు తయారీ! ఈనెల 28న సిపిఐ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ నేపాల్‌ను ముంచెత్తనున్న భారీ వర్షాలు: వరదలు, కొండచరియలు విరిగిపడే ముప్పుతో హై అలర్ట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత! ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం…ముగ్గురు శిశువుల మృతి మహారాష్ట్ర యూసీసీ కమిటీ నుంచి మాజీ న్యాయమూర్తి ఆర్సీ చవాన్ రాజీనామా: ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై తీవ్ర అభ్యంతరం రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులుగా సిపి రమేష్ బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు 'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. అభిమాని ప్రవర్తనపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం! స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి? బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు వినాయక వేడుకల్లో తీవ్ర విషాదం…విద్యుత్ షాక్ తో యువకుడి మృతి

'ఇట్లు అర్జున' ఈవెంట్‌లో వింత ప్రశ్న.. అనస్వర రాజన్ క్యూట్ రియాక్షన్ వైరల్!

Select Suryaa Now
'ఇట్లు అర్జున' ఈవెంట్‌లో వింత ప్రశ్న.. అనస్వర రాజన్ క్యూట్ రియాక్షన్ వైరల్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సాయి అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న రాబోయే చిత్రం 'ఇట్లు అర్జున'. మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఇప్పటికే Shooting పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ మీడియా సమావేశంలో హీరోయిన్ అనస్వర రాజన్‌కు ఎదురైన ఓ వింత ప్రశ్న, దానికి ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఓ విలేకరి స్పందిస్తూ, 'యాక్టర్ గా మీ హిస్ట్రియానిక్స్ (నటన, హావాభావాలు)పై మీరేలా కామెంట్ చేస్తారు?' అని అనస్వరను ప్రశ్నించారు. ఈ విచిత్రమైన ప్రశ్న వినగానే అనస్వర రాజన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నవ్వులు చిందించింది. పక్కనే ఉన్న హీరో సాయి అనీష్ కూడా ఆ ప్రశ్న అర్థం కాక చిరునవ్వులు చిందించడంతో వేదిక వద్ద సరదా వాతావరణం నెలకొంది. ఆమె క్యూట్ రియాక్షన్‌కు అక్కడ ఉన్న విలేకరులు, ప్రేక్షకులు చప్పట్లతో మద్దతు తెలిపారు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు అనస్వర సహజమైన ప్రవర్తనను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అడిగిన ప్రశ్నకు చిరునవ్వుతోనే చక్కటి సమాధానం చెప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, 'సూపర్ శరణ్య' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ భామ, 'ఇట్లు అర్జున'తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమాలో ఆయన కుమార్తెగా నటిస్తూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.