BREAKING
‘హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మేదారీ’ భారత్‌తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత సెప్టెంబర్ 18న థియేటర్లలోకి ‘పిఠాపురంలో… అలా మొదలైంది’.. తండ్రీకూతుళ్ల అనుబంధంతో రాబోతున్న ఫీల్ గుడ్ మూవీ! దుబాయ్ ఏఐఎం కాంగ్రెస్‌లో బీహార్ ప్రతినిధి బృందం ఆసియా క్రీడల్లో స్వర్ణమే లక్ష్యం క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గౌఫ్, రైబాకినా.. స్వియాటెక్ పై జెంగ్ సంచలన విజయం భారతదేశ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్‌కు భారీ స్పందన ‘కాకా’లో అమ్ములు పాపగా అనస్వర రాజన్.. మెగాస్టార్ నీడలో క్యూట్ అండ్ ఇంటెన్స్ లుక్! కుటుంబంతో కలిసి ‘ఎపిక్’ చూడొచ్చు.. కడలి పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎమ్మెల్సీల రిమాండ్ ను తిరస్కరించిన కోర్టు రూపాయి పతనం ప్రయాణం.. డాలర్‌తో మారకం విలువ 94.80 దాటింది! చమురు మంటలు.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం, 550 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్! తెలంగాణలో గణేష్ మండపాలకు కొత్త రూల్.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి! పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ నందన: లండన్ ఉద్యోగాల మోసం కేసులో కీలక పరిణామాలు! డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం!

‘కాకా’లో అమ్ములు పాపగా అనస్వర రాజన్.. మెగాస్టార్ నీడలో క్యూట్ అండ్ ఇంటెన్స్ లుక్!

Select Suryaa Now
‘కాకా’లో అమ్ములు పాపగా అనస్వర రాజన్.. మెగాస్టార్ నీడలో క్యూట్ అండ్ ఇంటెన్స్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’పై టాలీవుడ్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవిని సరికొత్త కోణంలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టాలెంటెడ్ నటి అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో అనస్వరను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అభివర్ణిస్తూ, ‘అమ్ములు పాప’ పాత్రను పరిచయం చేశారు. చేతిలో పుస్తకాలు, తెల్లని కోట్, స్టెతస్కోప్, భుజానికి బ్యాక్‌ప్యాక్‌తో ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌గా ఆమె చాలా సింపుల్‌గా, అమాయకంగా కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్‌లోని అసలు ట్విస్ట్ ఆమె వెనుక ఉన్న నీడలో దాగుంది. గోడపై మెగాస్టార్ చిరంజీవి సిల్హౌట్ కనిపిస్తుండటం, ఆ అమ్మాయిని రక్షించడానికి ‘సత్యం’ పాత్ర నీడలా కాపలా ఉందనే హింట్‌ను ఈ పోస్టర్ బలంగా ఇస్తోంది. సాఫ్ట్ అండ్ చీర్‌ఫుల్ అప్పియరెన్స్‌కు, యాక్షన్ ఇంటెన్సిటీకి మధ్య ఉన్న ఈ కాంట్రాస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.