BREAKING
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి అమెరికాతో ఆయుధ కొనుగోలు ఒప్పందాలపై తైవాన్ కీలక ప్రకటన ఒక్క వారమైనా షారుఖ్ ఖాన్‌లా బతకాలని ఉంది.. హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు! శ్రీరాముడి అతిపెద్ద బలం అదే.. రామాయణం సినిమాపై రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు! నేడు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటన.. వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కల్కి సీక్వెల్‌లో దుల్కర్ సల్మాన్?.. వైరల్ అవుతున్న వార్తలు! పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. క్వీన్‌లా రాజసమైన నడక! బిగ్ బాస్ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తత.. టాస్క్‌లో కంటెస్టెంట్లకు గాయాలు! ఘనంగా అనకాపల్లి ప్రీ రిలీజ్ వేడుక.. అక్టోబర్ 2న థియేటర్లలోకి చిత్రం! మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు! తిరుమలలో మంత్రి నారా లోకేష్ SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు..

ఘనంగా అనకాపల్లి ప్రీ రిలీజ్ వేడుక.. అక్టోబర్ 2న థియేటర్లలోకి చిత్రం!

Select Suryaa Now
ఘనంగా అనకాపల్లి ప్రీ రిలీజ్ వేడుక.. అక్టోబర్ 2న థియేటర్లలోకి చిత్రం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అనకాపల్లి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావడం విశేషం. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాండ్రేగుల నాయుడు మరో నిర్మాతగా వ్యవహరించగా, కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ అనకాపల్లి సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు, నిర్మాత, రచయిత సాయి రాజేష్ మాట్లాడుతూ విక్రమ్ చాలా తక్కువ సమయంలోనే పెద్ద హీరో అవుతాడని ప్రశంసించారు. హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ ఈ సినిమా పూర్తిగా ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలు మరియు అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిందని వెల్లడించారు. త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ చిత్రంలోని మాటలు, ఫైట్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు నిర్మాత కాండ్రేగుల నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రానికి మంచి ప్రేక్షక ఆదరణ లభించాలని ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకుడు కిరణ్ షా హుస్సేన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సినిమాటోగ్రాఫర్ కన్ డైరెక్టర్ రసూల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జంద్, కెమెరామెన్ మాయా వి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొని సందడి చేశారు. యువ నూతన తారల నటన, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.