BREAKING
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో క్షీణించిన గాలి నాణ్యత: 62 రోజుల గరిష్టానికి ఏక్యూఐ.. రానున్న వారం పొడి వాతావరణం జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర కుడిపక్ష పార్టీ ఏఎఫ్‌డీ బోణీ ముడి చమురు ధరల తగ్గింపుతో పుంజుకున్న సూచీలు ఆసియా క్రీడల్లో సుచికా తరియల్ చరిత్ర ఏపీకే సైబర్ మోసాల గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు, అహ్మదాబాద్‌లో ముగ్గురి అరెస్ట్ వైభవంగా ప్రారంభమైన ఒడిశా టి20 లీగ్ సీఎం ట్రోఫీ, హాజరైన ముఖ్యమంత్రి బిట్‌కాయిన్ మెరుపు ర్యాలీ: వారంలో 5 శాతం ఎగబాకి 81,450 డాలర్ల వద్దకు.. ఈ జోరుకు కారణాలేంటి? ప్రీమియర్ లీగ్: చివరి నిమిషంలో అద్భుత గోల్, బోర్న్మౌత్‌పై లివర్‌పూల్ కష్టతరమైన విజయం ఆసియన్ గేమ్స్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం వాతావరణ మార్పులపై పోరుకు ప్రజల భాగస్వామ్యం అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసియన్ గేమ్స్: పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌కు శ్రీహరి నటరాజ్ అర్హత పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు, క్వార్టర్స్‌లోకి ప్రవేశం ఇస్రో రాడార్ పరిశోధనా కేంద్రానికి సీఎం హిమంత బిస్వా శర్మ శంకుస్థాపన ఒడిశా టి20 లీగ్: గౌరవ్ చౌదరి మెరుపు ఇన్నింగ్స్, కటక్ పాంథర్స్‌పై సంబల్‌పూర్ వారియర్స్ విజయం కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక: సంక్షేమ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వం సర్వసన్నద్ధం

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన స్టార్ హీరో అజిత్ అభిమానులు

Select Suryaa Now
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన స్టార్ హీరో అజిత్ అభిమానులు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాజకీయంలో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తూ అజిత్ అభిమానులంతా ఏకమై "తమిళగ మక్కల్ కళగం" అనే పేరుతో నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. కళ్లకురిచి జిల్లా పరిధిలో జరిగిన సమావేశంలో అభిమానులు అందరూ సమీకృతమై పార్టీ జెండాను ఆవిష్కరించారు. పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో రూపొందించిన ఈ జెండా మధ్యలో రెండు చిరుతపులుల గుర్తులను పొందుపరిచారు.

గత రెండు మూడు దశాబ్దాలుగా నటుడు అజిత్‌కు మద్దతుగా నర్పణి మండ్రాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, ఇకపై వాటన్నింటినీ ఒక రాజకీయ వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ముఖ్య ఉద్దేశమని అభిమానులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాడులోని 38 జిల్లాల వ్యాప్తంగా ఉన్న అజిత్ అభిమానులు ఈ పార్టీ పరిధిలోకి వచ్చారని, తమ నాయకుడు అజిత్‌కు రాజకీయాల్లో స్థానం కల్పించేందుకు పార్టీలోని అత్యంత కీలకమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఆయన కోసం ప్రత్యేకంగా కేటాయించి ఉంచామని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

అయితే ఈ కొత్త పార్టీ స్థాపనకు, నటుడు అజిత్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని అభిమానుల సమాఖ్య క్లారిటీ ఇచ్చింది. తమ హీరో అజిత్ ఏనాడూ రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదని, ఇది అభిమానులుగా తామంతా సొంతంగా తీసుకున్న నిర్ణయమని వివరించారు. ఎవరినీ విమర్శించడం లేదా వేరే ఏ పార్టీని లక్ష్యంగా చేసుకోవడం తమ ఉద్దేశం కాదని, ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అలాగే తమిళనాడువ్యాప్తంగా అజిత్ పేరుతో మరే ఇతర అభిమానుల బృందాలు వేర్వేరు పార్టీలు పెట్టకుండా ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

కాగా కొద్దికాలం క్రితమే హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశం చేసి పార్టీ స్థాపించిన నేపథ్యంలో, తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అజిత్ అభిమానుల పొలిటికల్ ఎంట్రీ ప్రాధాన్యత సంతరించుకుంది. రేసింగ్, సినిమాలు అంటూ ఎంతో బిజీగా ఉండే అజిత్ ఇప్పటికే తన అధికారిక అభిమాన సంఘాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు ప్రారంభించిన ఈ "తమిళగ మక్కల్ కళగం" పార్టీ భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి ముద్ర వేస్తుందోనని కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.