BREAKING
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆలోచన.. బ్యాంకుల కనీస నగదు నిల్వల నిబంధన రెట్టింపు చేసే యోచన! యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆలోచన.. బ్యాంకుల కనీస నగదు నిల్వల నిబంధన రెట్టింపు చేసే యోచన! పొలం బడి కార్యక్రమంలో ఫీల్డ్ డే నిర్వహణ : బొబ్బిలి ఎంపిపిగా బొబ్బిలి సునీన ఏకగ్రీవంగా ఎన్నిక రేడియల్ రోడ్డు పనుల్లో చెట్ల తొలగింపునకు అటవీ శాఖ అనుమతి తప్పనిసరి:పరిగి ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ అచ్చంపేటలో ఎల్ నినో పై ప్రత్యేక గ్రామసభ గజపతినగరం ఎంపీపీగా గంట్యాడ శ్రీదేవి ప్రమాణ స్వీకారం యావపూర్ లో మహిళా సంఘం నూతన భవనం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం.. ఎమ్మెల్యే " కోండ్రు " టేక్మాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివా ళులు అర్పించిన మండల్ కాంగ్రెస్ నాయకులు శర్వానంద్ భోగి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 27న థియేటర్లలో మాస్ జాతర! ఎంపీపీగా దన్నాన పద్మావతి అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడికి మరింత కఠిన చర్యలు అవసరం.. డిసెంబరులో 0.50 శాతం వడ్డీ పెంపునకు ఫెడ్ గవర్నర్ వాలర్ సూచన! భోగాపురం ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ! తూప్రాన్ లో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ

యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలు

Select Suryaa Now
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్  అవగాహన వారోత్సవాలు

 

పార్వతీపురం, సూర్య: యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ప్రజారోగ్యానికి ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళలో ఒకటనీ, దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. విజయలక్ష్మి అన్నారు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలు సందర్భంగా ఆరోగ్య కార్యాలయంలో గురువారం అవగాహన కార్యక్రమమo నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు వంటి సూక్ష్మజీవులు వాటిపై ఉపయోగించే ఔషధాలకు నిరోధకతను అభివృద్ధి చేసుకోవడాన్ని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారనీ , దీనివల్ల అంటువ్యాధులకు చికిత్స చేయడం మరింత కష్టతరమవుతుందన్నారు.
బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల చికిత్సలో యాంటీబయోటిక్స్ అత్యంత ముఖ్యమైన ఔషధాలు. వీటిని అనుచితంగా మరియు అధికంగా ఉపయోగించడం వల్ల యాంటీబయోటిక్ నిరోధకత అభివృద్ధి చెందడానికి మరియు వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.
ఎ ఎం ఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యార్థులు, రైతులు మరియు సాధారణ ప్రజలకు యాంటీమైక్రోబియల్ ఔషధాలను బాధ్యతాయుతంగా ఉపయోగించడం మరియు నివారణ చర్యలపై ఈ నెల 24 వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అర్హత కలిగిన వైద్యుల సూచన మేరకే యాంటీబయోటిక్స్ వాడాలి, వైద్యులు సూచించిన మోతాదును, చికిత్సా కాలవ్యవధిని పూర్తిగా పాటించాలి, యాంటీబయోటిక్స్ వినియోగంపై సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి, చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరియు శ్వాస సంబంధిత పరిశుభ్రత నియమాలను పాటించాలి,సూచించిన టీకాలను తప్పనిసరిగా వేయించుకోవాలి,వైద్యుల సలహా లేకుండా సొంతంగా యాంటీబయోటిక్స్ వాడకూడదు,ఇతరులతో యాంటీబయోటిక్స్ పంచుకోకూడదు లేదా ఇతరుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులువాడకూడదు,మిగిలిపోయిన యాంటీబయోటిక్స్‌ను భవిష్యత్తులో వాడటానికి నిల్వ ఉంచకూడదు. ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయడం, సరైన ప్రిస్క్రిప్షన్ విధానాలను పాటించాలన్నారు. నేడు యాంటీబయోటిక్స్‌ను దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ప్రాణరక్షకమైన ఈ ఔషధాల ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. 'ఒకే ఆరోగ్యం-ఒకే కార్యాచరణ'తో 
యాంటీబయోటిక్ ప్రభావాన్ని కాపాడటానికి, మనుషులు, జంతువులు మరియు పర్యావరణానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి మనమందరం కలిసి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా వై. విజయ మోహన్ , డా షేక్ హఫీజా, డా టి. జగన్ మోహనరావు, డా ఎం. రవి కుమార్ రెడ్డి, డా. సూర్య కౌశిక్, డా. హేమ, డా. వెంకటేష్ , డా. గుణశ్రీ , డా. రమణ కుమార్, డా. మణికంఠ, వైద్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.