BREAKING
S V V స్కూల్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు

యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలి...ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

Select Suryaa Now
యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలి...ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
  • ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి వినతి అందజేత
  • వివోఏలు గౌరీ,జ్యోతి,శ్రీదేవి, తులసి,యశోద,రాజేశ్వరి తదితరులు

గరుగుబిల్లి, సూర్య: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించి,న్యాయం చేయాలని కోరు తూ గరుగుబిల్లి వెలుగు యానిమేటర్లు (వి వో ఏ)లు కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి ఆదివారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈమేరకు గుమ్మలక్ష్మీపురంలోని క్యాంపు కార్యాల యంలో కురుపాం నియోజకవర్గo శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి యానిమేటర్ల సంఘం ప్రతినిధులు కలిసి తమ సమ స్యలను తెలియజేశారు.ఈసందర్భంగా యానిమేటర్ల ప్రతినిధులు మాట్లాడు తూ గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తాము అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు.అయినప్పటికీ తమకు సరైన గుర్తింపు, కనీస వేతనాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమకు కనీస వేతనం నెలకు 26వేల రూపాయ లు చెల్లించాలని వేతనాలను నేరుగా తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.యానిమేటర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ యానిమేటర్ల సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు వంటి అంశాలపై మాట్లాడుతానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో వివోఏలు వావిలిపల్లి స్వాతి, ఇజ్జురోతు గౌరీ, గొట్టాపు జ్యోతి, బొబ్బిలి జ్యోతి, గొట్టాపు సుజాత, గంట శ్రీదేవి, చింత ఉషారాణి, బలగ మంగమ్మ, గులిపల్లి అనురాధ, గంట క్రాంతికుమారి, పెనుగంటి తులసి, వెలగాడ శ్రీదేవి, గుంట కల్పన, నెల్లి  లీలాకుమారి, అల్లు ఉషారాణి, నూలు తనూజ,బేత సరస్వతి, గంట యశోద, అల్లు యశోద, ఓలేటి పావని, కైంకర్యం కిరణ్మయి, బొంతాడ పద్మ, బడే సుధారాణి , పిల్లి విజయ, మండల కళ్యాణి ,బంటు రాజేశ్వరి, బోను విజయలక్ష్మి, మంత్రబుడ్డి సుజాత, బొబ్బిలి సుశీల, డోళ్ళు మానస, ఏగిరెడ్డి భవాని, బలగ పద్మ, దాసరి సీతారాం, జామి సువర్ణ, చదురు వరలక్ష్మి, మరిశర్ల స్వాతి, గుల్ల రాజేశ్వరి,గంట జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.