వృత్తి విద్యతో విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు– ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత
అవనిగడ్డ: మేజర్ న్యూస్; సాధారణ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను నేర్పించడం ద్వారా విద్యార్థులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశం కలుగుతుందని అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొబైల్ రిపేర్ నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న 60 మంది విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.మొవ్వ వి.ఎస్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భాగస్వామ్యంతో పీఎం ఉషా పథకంలోని జెండర్ ఇన్‌క్లూజన్ అండ్ ఈక్విటీ విభాగంలో యాక్సిస్‌పాయింట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహించారు. 15 రోజులపాటు అంకితభావంతో శిక్షణ పొందిన విద్యార్థులను డాక్టర్ సుజాత అభినందించారు. మొబైల్ రిపేర్ శిక్షణ స్వయం ఉపాధి పొందేందుకు, భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మొవ్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమారాణి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. మొబైల్ రిపేర్ శిక్షకుడు మాధవరావు, కళాశాల సిబ్బంది మంజుల, అంకారావు, అయ్యప్ప, స్వర్ణజ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.