వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి
వంగర నవంబర్ 25 మేజర్ న్యూస్ మండలం లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా వంగర మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మండలంలోని మొత్తం 29 గ్రామ పంచాయతీలకు గాను నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల లో బరిలో ఉన్న అభ్యర్థులు స్పష్టమైంది. గ్రామ పెద్దల మరియు ప్రజలు చొరవ,తో ఏకాభిప్రాయంతో అరసాడ. లక్షు భుక్త ధనలక్ష్మి కృష్ణం నాయుడు. కింజంగి. బలిజిరెడ్డి భవాని నీలయ వలస టోంపల బలరాము. కొప్పర. గుడివాడ జయమ్మ.సంగాం. వేణు బొడ్రోతు రాజుల గుమ్మడ. ఆలబెల్లి వెంకట నాయుడు తలగాం. పైల కోటేశ్వరరావు మండలంలోనిఈ 7 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రభుత్వానికిఎన్నికల ఖర్చు, తగ్గుతుంది అలాగే ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం అందిస్తున్న పారితోసకం గ్రామాల అభివృద్ధికి తోడ్పడ తవ అన్న ఉద్దేశంతో ఆయా గ్రామాల ప్రజలు నాయకులు గ్రామాలఅభివృద్ధే లక్ష్యంగా ఈ గ్రామాలు ఏకగ్రీవ బాట పట్టాయి. మిగిలిన 22 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీల మద్దతుదారులు తమ తమ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల్లో ఓటర్లతో అనుసంధానమే తమ తమ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తున్నారు గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. 29 జరిగే ఎన్నికలకు గ్రామాల్లో ఎటువంటి తగదాలకు తావులేకుండా పోలీస్ వారు ప్రతి గ్రామంలో ముందస్తుగా. ఓటర్లకు అవగాహన నిర్వహించారు.